.. అడువాల జ్యోతి లక్ష్మణ్..
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణ 40వ వార్డు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నా మని, అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని స్థానిక మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కోరారు. బుధవారం వార్డులో ఇంటి ఇంటికి తిరిగి మీ మద్దతుతో వస్తున్నామని. తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అందరిని కలిసి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో వార్డు ప్రజలు, యూత్ నాయకులు ఉన్నారు.