వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి
నవగీతం, కరీంనగర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండిలో రూ. 45.15 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) కి, అలాగే రూ. 5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు విమానాశ్రయం పూర్తి కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసి జంట నగరాలుగా...