అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
నవగీతం, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని గూడెం గ్రామంలోని శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా రాత్రి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ చిట్నేని వెంకటేశ్వరరావు, ఆలయ అధ్యక్షులు బి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి తాండ్రగిరి రావు లు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఆలయ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాము....