అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

నవగీతం, కోరుట్ల కథలాపూర్ మండలం సీరికొండ గ్రామంలో బుధవారం రోజున శ్రీ మహాదేవ స్వామి శివాలయం లో శివపార్వతుల కల్యాణం వైభవంగా,  కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో పార్వతీ, పరమేశ్వరులను వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలు, వివిధ రకాల పూలతో దివ్యమనోహరంగా అలంకరించారు. శివపార్వతుల కల్యాణ వస్త్రాలను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాలతో గ్రామ వీధుల్లో ఊరేగించిన అర్చకులు  ఆలయంలో అధిష్ఠింపజేశారు. సకల విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడికి తొలిపూజలతో అర్చకులు కల్యాణతంతు ప్రారంభించారు. నూతన వధూవరులు శివ పార్వతులకు కల్యాణ వస్త్రాలు అందజేశారు. పరమేశ్వరుడికి యజ్ఞోపవీతధారణ పర్వాలు జరిపిన అర్చకులు...