navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 9:57 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

నవగీతం,కోరుట్లప్రతినిధి :

సోమవారం రాత్రి కురిసిన భారీ గాలి వానలకు వరి పంట నేలమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి నాగమణి , ఏఈఓ లతో కలిసి ఏకీన్ పూర్ పరిధిలో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షం పడటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ నరేష్, ఏకీన్ పూర్ 6వ వార్డు కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి, అలాగే రైతులు కళ్లెం రవి, మిట్టపెల్లి భూమారెడ్డి, మామిడి మల్లేశం, లకపతి రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మ్యాదరి లక్ష్మణ్, ఊరుమడ్ల వెంకటి, కాశిరెడ్డి వెంకటా రెడ్డి, పుటకపు లింగం, ఎర్ర భూమయ్య తదితర రైతులు పాల్గొన్నారు.