navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 1:26 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అగ్నివీర్ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మార్చి 10 లోపు ఆసక్తి గల యువత దరఖాస్తు చేసుకోవాలి

నవగీతం, పెద్దపల్లి:

జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు అవకాశాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ,అగ్నివీర్ లో ఉద్యోగం ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు రెండు రకాల నోటిఫికేషన్ విడుదల చేశారు అని మొదటిది ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులకు ఈనెల 9వ తేదీన గుంటూరులో జరిగే అగ్ని వీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026 నకు సంబంధిత, అవసరమైన పత్రాలు తీసుకువెళ్లి ర్యాలీలో నేరుగా పాల్గొనే అవకాశం ఉందని కలెక్టర్ సూచించారు.

మరొక నోటిఫికేషన్ అగ్ని వీర్ వాయు నందు అవివాహిత అభ్యర్థులు 2027 రిక్రూట్మెంట్ కోసం 22 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే సంబంధిత ఉద్యోగాల కోసం మార్చి 10 లోపల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ద్వారా లాగ్ ఇన్ అయి ఈనెల 10వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రెండు నోటిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ విద్యార్హత అని ఇతర వివరాలకు అగ్నివీర్ వాయు వెబ్సైట్ లేదా ఈ కింది మాధ్యమాల ద్వారా సంప్రదించవచ్చు. iafrecruitment.edcil.co.in లేదా agnipathvayu.cdac.in క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పూర్తి సమాచారం పొందవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.