navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 10:53 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కేబినెట్ ఆమోదంపై హర్షం

యువ న్యాయవాది ఉమా మహేష్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదంపై బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, న్యాయవాది కూర్మాచలం ఉమా మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ఉమా మహేష్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పై ఆమోదం తెలపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. న్యాయవాదులపై భౌతిక దాడులు రోజు రోజుకు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ఉమా మహేష్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు . జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.