navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 8:30 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అన్-మ్యాన్డ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలి

నవగీతం,మెట్ పల్లి:

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ  ఆధ్వర్యంలో గురువారం మెట్‌పల్లి డివిజన్ కార్యాలయం హోరెత్తింది.ఆర్టిజన్ అన్మాడ్ మరియు పీసీ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అర్హతను బట్టి గుర్తింపు ఇవ్వాలి ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో రాత్రింబగళ్లు శ్రమిస్తున్న అన్-మ్యాన్డ్ కార్మికులను వెంటనే సంస్థలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్హత కలిగిన ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ప్రక్రియ చేపట్టాలని, అలాగే వారికి ఏపీఎస్సీబీ  నిబంధనలను వర్తింపజేయాలని కోరారు. పీసీ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు మండిపడ్డారు. మిగిలి ఉన్న 6000 మంది కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ కో చైర్మన్ రాంబాబు డివిజన్ చైర్మన్ కోటేశ్వర్ కో చైర్మన్ మహేష్ కన్వీనర్ గంగాధర్ రాజేందర్ లోకేష్ విష్ణువర్ధన్ సాగర్ నాగార్జున విజయ్ మధు మల్లేష్ శ్యామ్ శ్రీనివాస్ శ్రీకాంత్ రాజశేఖర్ కోరుట్ల రవి శ్రీధర్, రాకేష్, శ్రీశైలం, శ్రీను, జలంధర్, అరవింద్, రాజశేఖర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఆర్టిజన్, అన్-మ్యాన్డ్ కార్మికులు పాల్గొన్నారు.