navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 3:44 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అసెంబ్లీ ముట్టడిస్తారని రైతు నాయకుల ముందస్తు అరెస్ట్

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతన్నల ఉద్యమ బాట.

నవగీతం జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మొక్కజొన్న కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో అసెంబ్లీ ముట్టడికి సమాయాత్తమైన రైతు నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు, జిల్లా కేంద్రానికి దగ్గర ఉండే రైతు ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి, బందెల మల్లయ్య లను జగిత్యాల రూరల్ పోలీస్ లు , రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి లను ఇబ్రహీంపట్నం, చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి, మారు మురళీ ధర్ రెడ్ది, గురిజాల రాజి రెడ్దిలను మెట్ పెళ్లి లో, కొడుమ్యాల లో నరసింహ రెడ్డి,భూషణ్ రావు పేట్ సర్పంచ్ బద్దం మహేందర్ రెడ్డి, రిక్కల సంజీవ్, గడ్డం శేఖర్, కందిరి కిషన్ లను కథలాపూర్, నేరెళ్ల భూమా రెడ్డి లను మాల్యాల పోలీస్ లు అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతు పండించిన మక్కల కు మద్దతు ధర 2400 అయితే బహిరంగ మార్కెట్ లో 1600-1800 మాత్రమే పెడుతూ దళారులు రైతులను మోసం చేస్తుంటే మార్క్ ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చెయ్యాలని 15 రోజుల క్రితం జిల్లా అడిషనల్ కలెక్టర్ కి ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం తో పాటు, మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్  దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినా నిర్లక్ష్యం వీడకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి సిద్దమైన రైతు నాయకులను ఇలా ముందస్తు అరెస్ట్ లు చేయడం హేయమైన చర్య అని, ఓ వైపు వాతావరణ శాఖ సైతం 15 రోజుల క్రితమే అకాల వర్షాల హెచ్చరిక లు జారీ చేసిన నేపథ్యంలో, రెండు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు పండిన పంటను నష్టపోయే పరిస్థితి దృష్ట్యా ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు, భూషణ్ రావు పేట్ సర్పంచ్ బద్దం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఓ వైపు మంత్రి తుమ్మల మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చెయ్యం ప్రత్యామ్నయ పంటలు పండించాలని చెపుతూనే రైతులు పండించిన మక్కల కొనుగోలు కేంద్రాలా ఏర్పాటులో జాప్యంతో రైతులను ముంచుతున్నారు, రైతుల కోసం పోరాడుతున్న రైతు నాయకులను ఇలా ముందస్తు అరెస్ట్ లు చేయడం లో ఉన్న శ్రద్ధ కొనుగోలు కేంద్రాలపై పెట్టాలని హెచ్చరించారు.