మున్సిపల్ చైర్ పర్సన్ వాణి – శ్రీనివాస్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
బాల బాలికలకు ఆత్మ రక్షణ కోసం టైక్వాండో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు.జిల్లా కేంద్రంలోని టౌన్ హల్ లో జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ తైక్వాండో పోటీలు నిర్వహించిన తైక్వాండో ఛాంపియన్ షిప్ – 2026 పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతోపాటు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

ఈ తైక్వాండో ద్వారా మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, ఆత్మస్థైరం పెంపొందుతాయన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు నాలుగు జిల్లాల నుండి సుమారు 380 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో చైర్మన్ మంచాల కృష్ణ, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ గందె కుమార్, జిల్లా అధ్యక్షులు గంగారం, తెలంగాణ టెక్నికల్ డైరెక్టర్ వెంకట స్వామి, నాలుగు జిల్లాల కార్యదర్శి సంతోష్, శ్రీనివాస్,సతీష్, రాజేందర్, ఆఫీసియల్ రెఫ్రిస్ రాజు, నాగమణి, ధరణిధర్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
