ఆ ముగ్గురి బలిదానం – ‘ఇంక్విలాబ్‌’ నినాదం

నవగీతం, హైదరాబాద్: ---------- ✍️తెలకపల్లి రవి, సీనియర్ జర్నలిస్ట్ తమ కాలం కంటే ముందుండే వాళ్లను దార్శనికులంటాం. జీవిత కాలంలోనే అందరి అభిమానం చూరగొనగలిగిన వాళ్లను అగ్రనాయకులంటాం. సవాళ్లు, సమరాలలో ముందుండేవాళ్లను సాహసికులంటాం. ధన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించ గలిగిన వాళ్లను త్యాగులంటాం. చేయవలసిందేమిటో, ఎందుకో స్పష్టంగా చెప్పగలవాళ్లను సిద్ధాంతకారులంటాం. ఇందులో ప్రతి నిర్వచనమూ భగత్‌సింగ్‌కు వర్తిస్తుంది. భగత్‌సింగ్‌ అంటే శాండర్స్‌ (స్కాట్‌) హత్య, పార్లమెంటు లో బాంబు ప్రయోగం, ధైర్యంగా ఉరికంబ మెక్కడం గుర్తుకురావచ్చు. నిజానికి నెత్తిమీద టోపీతో మన మనసులలో స్థిరపడిన...