నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లాకు చెందిన సింగం భాస్కర్ ఇంటర్నేషనల్ తమిళ్ కల్చరల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పట్టా అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సింగం భాస్కర్ విద్యా విభాగంలో అందిస్తున్న సేవలకు గాను ఇంటర్నేషనల్ తమిళ్ కల్చరల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పట్టాను అందుకున్నారు. సింగం భాస్కర్ డాక్టరేట్ అందుకోవడం పట్ల జిల్లాకు చెందిన పలువురు విద్య సంస్థల అధినేతలు, విద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.