ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద డిగ్రీ కళాశాల సిబ్బంది ప్రచారం
నవగీతం, మెట్ పల్లి టౌన్: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,అరోరా జూనియర్ కళాశాల, నరేంద్ర జూనియర్ కళాశాలలతో పాటు ఇబ్రహీంపట్నం,మల్లాపూర్ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో మంగళవారం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య ఆదేశాల మేరకు మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది సమక్షంలో అడ్మిషన్ల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన కరపత్రాలను ఆయా కళాశాల పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు...