ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులను ఆ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని తెలిపారు.ఇటుక, కంకర, బేస్మెంట్ పై ధరల నియంత్రణ ఇండ్లు లబ్ధిదారులకు  ధరలు అనుగుణంగా...