navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 6:55 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఈవీఎం భద్రపరిచిన గోదాం తనిఖీ చేసిన కలెక్టర్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మంగళవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల  ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు.

గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్  (రెవెన్యూ) బి.ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మరియు కలెక్టరేట్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియ తదితరులు పాల్గొన్నారు.