ఈ- వ్యర్థాలపై అవగాహన

నవగీతం,మల్లాపూర్ : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా నాలుగవ రోజు సోమవారం మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిసరాల్లో గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఈ- వ్యర్థాలు గురించి గ్రామస్థులకు అవగాహన నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ-వ్యర్థాలు (E-waste) అంటే ఉపయోగం అయిపోయిన, పాడైపోయిన లేదా పాతబడిన ఎలక్ట్రానిక్ వస్తువులనే 'ఎలక్ట్రానిక్ వ్యర్థాలు' లేదా  'ఈ-వ్యర్థాలు' అని పిలుస్తారు. ఈ-వ్యర్థాలు సాధారణ చెత్త లాంటివి కావు. వీటిలో సీసం (Lead), పాదరసం (Mercury), కాడ్మియం...