navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 5:49 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి బోధనలో నాణ్యతను పెంచాలి : కలెక్టర్ సత్య ప్రసాద్

నవగీతం, మెట్ పల్లి:

మెట్ పల్లి లోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థుల చదువుతున్న తీరును స్వయంగా పరీక్షించి 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి సరిగా చదవలేకపోవడం గమనించి ప్రధానోపాధ్యాయురాలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీస ప్రాథమిక చదవు నైపుణ్యాలు కూడా రాకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నించారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి సరైన విధంగా చదవడం నేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ బి. సత్యప్రసాద్ 30 రోజులలోగా ప్రతి విద్యార్థికి కనీసం చదవడం రావాలని లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మరోసారి పాఠశాల సదర్శించే లోపు పరిస్థితి మెరుగుపడకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని స్పష్టం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేసి బోధనలో నాణ్యతను పెంచాలని, ప్రతి విద్యార్థి చదువులో ముందుకు రావడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.