మూల్యాంకన పరీక్ష నిర్వహణ ను పరిశీలించిన జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం.రఘువరణ్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
నిరక్ష్యరాస్యత నిర్ములనకు మహిళా సంఘాల ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపిన జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం. రఘువరణ్ జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, గొల్లపల్లి, బుగ్గరాo మండలాల్లో ఉల్లాస్ నావభారత సాక్షరతా కార్యక్రమం మూల్యాంకన పరీక్ష నిర్వహిణను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు గ్రామాల్లో చదువు రాని మహిళలను ముందుగా గ్రామ సంఘాల సహాయకుల ద్వారా గుర్తించి వారికీ సాయంత్రం పూట అక్ష్యరాస్యత నేర్పించడం జరిగిందని,తదుపరి ఈరోజు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆయా పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించడం జరిగిందని, జిల్లా లో దాదాపు 22, 000మంది మహిళలు చాలా ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొన్నారని, విద్య శాఖ వారి సహకారం తో,అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆయా ప్రజా ప్రతినిధుల సహకారం, గ్రామ సమాఖ్య సభ్యులు,సెర్ప్ వి. ఓ. ఏ లు,సి. సి. లు, ఎపియం ల పర్యవేక్షణ లో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని ఇదే స్పూర్తితో జిల్లా ని వంద శాతం అక్ష్యరాస్యత సాధించే విదంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు., జిల్లా అదనపు ప్రాజెక్టు అధికారి పి. సునీత కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి మండల కేంద్రాలను సందర్శించి పరీక్షలని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు విజయ వంతం చేసిన సెర్ప్ సిబ్బంది కి అభినందనలు తెలిపారు.వీరితో జిల్లా ఐబీ ఎపియం వోదెల. గంగాధర్, ఎపియం లు రమాదేవి, సి. సి. లు మహేష్, గంగరాo, గంగాధర్,ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఎపియం లు, సి. సి. లు, యం. ఎస్. సి. సిలు, మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య అధ్యక్షులు,గ్రామ సమాఖ్య అసిస్టెంట్ లు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున హాజరైనారు.
