navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 5:42 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎక్సలెన్స్ అచీవ్ మెంట్ ఇన్ స్పోర్ట్స్ జాతీయ అవార్డు అందుకున్న శ్రీనివాస్

పంజాబ్ లోని అమృత్సర్ లో అవార్డు ప్రధానం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

పంజాబ్ రాష్ట్రం లోని అమృత్సర్ లో యూత్ & స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్సలెన్స్ అచీవ్ మెంట్ అవార్డు 2025 -26 స్పోర్ట్స్ అచీవ్ మెంట్ విభాగంలో జగిత్యాల జిల్లా కు చెందిన కరాటే మాస్టర్ మర్రిపెల్లి శ్రీనివాస్ నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు.ఈ మేరకు శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో యూత్ & స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్టం నుండి ఎంపికై ఈ అవార్డు అందుకోవటం చాలా గర్వకారణం అని అన్నారు.జాతీయ స్థాయి అవార్డు అందుకున్న సందర్బంగా శ్రీనివాస్ ను జగిత్యాల డి వై ఎస్ ఓ డాక్టర్ రవి కుమార్,ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహిపాల్, జనార్దన్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ చక్రధర్ రావు,పెటా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పడాల విశ్వప్రసాద్, అశోక్,ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమి డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ వసంత్ కుమార్,పీడీ లు కృష్ణ ప్రసాద్, లక్ష్మి రాం నాయక్, సీనియర్ కరాటే మాస్టర్ లు మరిపెల్లి లింగయ్య, ఆనంతుల. కాంతారావు తదితరులు అభినందించారు.