navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 7:14 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎక్సలెన్స్ అచీవ్ మెంట్ ఇన్ స్పోర్ట్స్ నేషనల్ అవార్డు కి ఎంపిక

కరాటే మాస్టర్ మర్రిపెల్లి శ్రీనివాస్ కి పలువురు అభినందనలు..

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

పంజాబ్ రాష్ట్రం లోని అమృత్సర్ లో యూత్ & స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి నిర్వహించే ఎక్సలెన్స్ అచీవ్ మెంట్ అవార్డు 2025 -26 స్పోర్ట్స్ అచీవ్ మెంట్ విభాగంలో కరాటేలో తెలంగాణ రాష్ట్రం లోని జగిత్యాల జిల్లా లో ఎంతో మంది విద్యార్థులను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించే విధంగా శిక్షణ ఇవ్వటమే కాకుండా రిఫరీ మరియు జడ్జి గా సేవలందిస్తున్న మర్రిపెల్లి శ్రీనివాస్ ని గుర్తించి ఎక్సలెన్స్ అచీవ్ మెంట్ ఇన్ స్పోర్ట్స్ నేషనల్ అవార్డు కి ఎంపిక చేయటం జరిగిందని అవార్డు కమిటీ కన్వీనర్ మరియు యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇండియా అధ్యక్షులు అభిలాష్ కుమార్ తెలిపారు.ఈ అవార్డు ని ఈ నెల 29 వ తేదీన పంజాబ్ రాష్ట్రం లోని అమృత్ సర్ లో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నట్లు వివరించారు.ఈ అవార్డు రావడం పట్ల క్రీడాభిమానులు పలువురు ప్రజా ప్రతినిధులు శ్రీనివాస్ కి అభినందనలు తెలిపారు.