ఎన్నారై అడ్వయిజరీ కమిటీ పర్యటనకు ప్రభుత్వం తక్షణమే ఏర్పాట్లు చేయాలి

యూఏఈ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ ఆవేదన నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వపరంగా అందుతున్న సేవలు,సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించడం కోసం తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ బృందం మార్చి12,13 తేదీల్లో ఏపీ పర్యటన చేపట్టడానికి జిఏడి ఎన్నారై డిప్యూటీ ప్రోటోకాల్ మెంబర్ సెక్రెటరీకి,అదేవిధంగా ప్రిన్సిపల్ జి ఏ డి సెక్రెటరీ కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏపీ ఎన్నార్టీ సంస్థ, ఓంక్యాప్ సంస్థ, పోలీస్ శాఖ లోని ఎన్నారై విభాగం,24 గంటల హెల్ప్ లైన్, రూ.10...