నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రముఖ జీవిత బీమా సంస్థ అయిన ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు తన 25 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలను జగిత్యాల డివిజనల్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, అడ్వైజర్లు కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సిల్వర్ జూబిలీ వసంతోత్సవాల భాగంగా డివిజనల్ మేనేజర్ మూల అనిల్ కుమార్ గౌడ్, యూనిట్ మేనేజర్లు, అడ్వైజర్లతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎస్ బి ఐ లైఫ్ ఇప్పటి వరకు మొత్తం రూ.3,06,452 కోట్ల క్లెయిమ్‌లను చెల్లించి కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని తెలిపారు. అలాగే సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏ యు ఎం ) రూ.5.11 లక్షల కోట్లు కాగా, దేశవ్యాప్తంగా 8.36 కోట్లకు పైగా పాలసీదారులకు 1176 బ్రాంచ్‌ల ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నట్లు వివరించారు.రాష్ట్రంలోనే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలలో అత్యధిక వ్యాపారం చేస్తూ, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లను సత్వరంగా అందిస్తూ బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.సమాజంలో పొదుపు అలవాటు పెంపొందిస్తూ, ఆర్థిక భద్రతను అందించడంలో అడ్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.వారు మరింత మెరుగైన వ్యాపారం చేస్తూ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించి సంస్థ అందించే ప్రయోజనాలను పొందాలని సూచించారు.అనంతరం సీనియర్ టెర్రిటరీ మేనేజర్ పల్లికొండ రాజేందర్ మాట్లాడుతూ, ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ “అప్నేలియే , అప్నో కెలియే ” అనే నినాదంతో ప్రతి కుటుంబానికి భద్రతను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు. భీమా రంగంపై ప్రజల్లో అవగాహన పెంచి, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీలను వివరించి ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని సూచించారు. అడ్వైజర్లు సమాజ సేవకుల్లా వ్యవహరిస్తూ కస్టమర్ల అవసరాలకు తగిన పాలసీలు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనిట్ మేనేజర్లు, కార్యాలయ సిబ్బంది, అడ్వైజర్లు పాల్గొన్నారు.