విద్యార్థులకు చెస్ బోర్డు లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత హైస్కూల్ లో గ్రేటర్ అట్లంట తెలంగాణ సొసైటీ, చెస్ నెట్వర్క్ వారి ఆద్వర్యం లో విద్యార్థులకు చెస్ బోర్డు లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ హాజరై ఆయన చేతుల మీదుగా చెస్ బోర్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. చెస్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది మెదడుకు మంచి వ్యాయామం. ఈ ఆట ఆడటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.చెస్ ఆడేటప్పుడు ప్రత్యర్థి గతంలో వేసిన ఎత్తులు, పాత గేమ్‌లలోని మెళకువలను గుర్తుంచుకోవాలి.

ఇది మీ జ్ఞాపకశక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఒక్కతప్పు అడుగు వేస్తే ఆట చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆటగాళ్లు బోర్డుపైనే పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇది నిత్య జీవితంలో కూడా ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మీ ,ప్రిన్సిపాల్ చంద్ర కళ,పి ఆర్ టి యూ అధ్యక్షులు ఆనంద్ రావు, అమర్నాథ్ రెడ్డి, చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్,గ్రేటర్ అట్లంట తెలంగాణ సొసైటీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణ రావు,కో ఆర్డినేటర్ సురేష్,వేణు గోపాల్ రావు,కొలగాని సత్యం, మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్, రిటైర్డ్ ఏం ఈ ఓ నారాయణ, రహీమ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
