కలెక్టరేట్ లో దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి

జగిత్యాల ప్రతినిధి: మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని తెలిపారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత మరియు నైతిక విలువలు ప్రజాప్రతినిధులకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి...