కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఉగాది సంబరాలు

పంచాంగ శ్రావణంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న స్వామి వారి సన్నిధిలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.'పరాభవ' నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దారం ఆదిరెడ్డితో కలిసి ఆయన స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక...