navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 9:29 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొడిమ్యాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.విద్యార్థులు మానసిక ప్రశాంతతతో పరీక్షలు రాయాలని సూచిస్తూ, పరీక్షా కేంద్రంలో కల్పించిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ తనిఖీలో ఆమె వెంట విద్యాశాఖ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ సుంకపాక నాంపల్లి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇ. రాజయ్య, స్థానిక ఎస్సై ఎస్. సందీప్ తదితరులు పాల్గొన్నారు.