నవగీతం, కోరుట్ల:
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోరుట్ల పట్టణ జనసేన పార్టీ కోరుట్ల పి ఓ సి వోడ్నాల రామారావు,వీర మహిళ వోడ్నాల సౌజన్య అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేసారు.అనంతరం సివిల్ హాస్పిటల్ లో జనసేన పార్టీ తరపున పేషంట్ల సౌకర్యార్థం చల్లని నీటి కొరకు ఆరు కుండలను అందించారు.

తరువాత హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు,పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు 50మంది పాల్గొన్నారు. అనంతరం రోడ్డు పైన ఉండే నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందు తీసుకెళ్తామని,అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అడ్లగట్ల సురేష్, వనతడుపుల సంజీవ్,మాసం విజయ్ కుమార్,గట్ల నరేష్, ఈశ్వర్ నగర్ ఉపసర్పంచ్ రమేష్, వేములకుర్తి ప్రభాకర్, కట్ట రంజిత్, ఉషకోలా శశి, దాసోహం అనిల్, ప్రశాంత్, చిలివేరి మణిదీప్,కోటగిరి సంపత్,తుమ్మ సురేష్ పులి అనిల్, సాయి కృష్ణ, చెట్పెల్లి రాజు స్వామి, పాల్గొన్నారు.
