క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

నవగీతం, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ అనుమతి తీసుకొచ్చేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలు లేని అనుకూల ప్రదేశాన్ని గుర్తించి క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపట్టేలా ప్రయత్నాలు చేస్తానన్నారు.సోమవారం మెట్టుగూడలో గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ కార్యాలయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా...