గడి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నవగీతం, కోరుట్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్ర అమూల్యం అని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించి, కేక్ కట్ చేసి, తినుబండారాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, కుటుంబం, సమాజం, విద్య, వైద్యం, విజ్ఞానం వంటి ప్రతి రంగంలో మహిళలు ప్రతిభ కనబరుస్తూ దేశ అభివృద్ధికి విశేషంగా దోహదపడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు కేవలం కుటుంబ పరిరక్షకులు మాత్రమే కాకుండా సమాజానికి...