navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 7:58 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందవద్దు.

నవగీతం, మల్లాపూర్

గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఎలాంటి భయాందోళనలు  చెందకూడదని గల్ఫ్ సంఘ నాయకులు పెనుకుల అశోక్ అన్నారు.వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పెనుకుల అశోక్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్న గల్ఫ్ కార్మికులు ఎలాంటి భయాందోళన చెందకూడదని గల్ఫ్ దేశంలో ఉన్న కార్మికులందరూ క్షేమంగా ఉంటారని అలాగే ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు యుద్ధ వాతావరణం సమీక్షిస్తూ సలహాలు ఇస్తుందని తెలిపారు.గల్ఫ్ లో ఉన్నటువంటి కార్మికులు ఏలాంటి యుద్ధ సంబంధిత వీడియోలు, ఫొటోలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టకూడదని పెట్టినచో కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు తెలిపారని, గల్ఫ్ కార్మికులు ఎప్పుడు కూడా తమకు ఉపాధి జీవనం ఇస్తున్న దేశాలకు సపోర్టుగా ఉండాలని అన్నారు వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం అధ్యక్షులు అరెల్లి మహేష్ మాట్లాడుతూ.. వి వి రావుపేట్ గల్ఫ్ కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అలాగే అక్కడ ఉన్నవారికి కూడా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే కచ్చితంగా హెల్ప్ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల నాయకులు పెనుకుల అశోక్. వి. వి. రావుపేట్ గల్ఫ్ అధ్యక్షులు.అరెల్లి మహేష్. వేముల నరేష్. బియ్యం సురేష్. రవీంద్ర చారి సకినపలి సాయిలు. బన్నీ రవి తదితరులు పాల్గొన్నారు