గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంపీ అర్వింద్ ధర్మపురి లేఖ నవగీతం, మెట్ పల్లి: రాబోయే గోదావరి పుష్కరాలు–2027 ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్‌ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్‌లకు పుష్కరాల సమయంలో కోట్లాది...