navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 2:02 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా కామ దహనం వేడుకలు

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రంలో దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామ దహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభాకర్ శర్మ పంతులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కామా దహన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం,శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని (కామదేవుడిని) భస్మం చేసిన రోజుగా దీనిని పరిగణిస్తారు.హోలీ పండుగకు ముందు రోజు రాత్రి జరుపుకునే కామదహనం చెడుపై మంచి విజయానికి సంకేతంగా భోగి మంటల తరహాలో ఈ ఆచారంగా నిర్వహిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పంతులు ప్రభాకర్ శర్మ, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంగ రాజన్న యాదవ్, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కారామ్, సభ్యులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, సుంకెట జీవన్ రెడ్డి, ముష్కరి రమేష్, ముద్దం శ్రీధర్, వార్డు సభ్యులు, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.