navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 7:38 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు.

చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల పట్టణంలోని సి ఎస్ ఐ వెస్లీ చర్చిలో ఆదివారం క్రైస్తవులు ‘మట్టల ఆదివారం’ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుకలను పురస్కరించుకుని మిషన్ కాంపౌండ్ లోని క్రైస్తవులు సండే స్కూల్‌ విద్యార్థులతో కలిసి ఈత మట్టలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కూడా క్రైస్తవులు ‘మట్టల ఆదివారం’ ను ఘనంగా నిర్వహించారు.ఆయా ఆలయాల పరిసరాల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మార్మోగిన కాంపౌండ్ వీధులు హోసన్నా జయం..జయం.. రాజుల రాజుకే జయం.. క్రీస్తు రాజుకే జయం అంటూ ఈతమట్టలతో ర్యాలీలు నిర్వహించారు. పిల్లలు, పెద్దలు వీధుల్లో ఈత మట్టలను చేతపట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.కాగా జగిత్యాల సీ ఎస్ ఐ దేవాలయంలో ఈత మట్టలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక భక్తి గీతాలు ఆలపించారు. మట్టల ఆదివారం విశిష్టత గురించి దైవ సందేశాన్ని ఆలయ గురువు జీవరత్నం అందించారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో స్థానికులు, స్థానికేతర భక్తులు తరలిరాగా, ఆలయం కిక్కిరిసిపోయింది.