ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు.

చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని సి ఎస్ ఐ వెస్లీ చర్చిలో ఆదివారం క్రైస్తవులు ‘మట్టల ఆదివారం’ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుకలను పురస్కరించుకుని మిషన్ కాంపౌండ్ లోని క్రైస్తవులు సండే స్కూల్‌ విద్యార్థులతో కలిసి ఈత మట్టలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కూడా క్రైస్తవులు ‘మట్టల ఆదివారం’ ను ఘనంగా నిర్వహించారు.ఆయా ఆలయాల పరిసరాల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మార్మోగిన కాంపౌండ్ వీధులు హోసన్నా జయం..జయం.. రాజుల రాజుకే జయం.....