సత్యమన్న కానుకగా నూతన వస్త్రాలు బహుకరణ
నవగీతం ,కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల నూకపల్లి గ్రామల్లో మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా శుభవేళ లో గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు
గ్రామానికి చెందిన భూస గంగరాజు, అవుసం పుష్పలత-శ్రీనివాస్ లకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాన్ని మల్యాల మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ దంపతులు సత్యమన్న కానుకగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో మల్యాల మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మిల్ట్రీ శ్రీనివాస్, ఎంపీడీఓ స్వాతి, ఎంపీవో ఆమని, ఏఈ. జ్ఞానేశ్వర్, హౌసింగ్ ఏఈ. లక్ష్మి ప్రసన్న, మాజీ ఎంపీపీ వెల్మ లక్ష్మారెడ్డి, పోతని రవి, అరుణ్ రావు, చెట్‌పల్లి నరేష్, పొన్నాం శ్రీనివాస్ గౌడ్, భూమన్న మహిపాల్ రావు, శరత్, బండి రవి తదితరులు పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
