ఘనంగా మద్దుట్ల నూకపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

సత్యమన్న కానుకగా నూతన వస్త్రాలు బహుకరణ నవగీతం ,కొడిమ్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల నూకపల్లి గ్రామల్లో మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా  శుభవేళ లో గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం  ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన భూస గంగరాజు, అవుసం పుష్పలత-శ్రీనివాస్ లకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాన్ని మల్యాల మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్...