ఘనంగా 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవగీతం, మెట్ పల్లి: జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మెట్ పల్లి పట్టణ జనసేన పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి, వివేకానంద విగ్రహానికి,పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లలను పంపిణీ చేయగా, రాధ్న్య బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహించగా జనసేన సైనికులు,పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు 60మంది స్వచ్ఛందగా రక్తదానం చేశారు. అయ్యప్ప గుడి ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.అనంతరం రోడ్డు పైన...