చదువుతోపాటు సంస్కారం అవసరమే

జిల్లా విద్యాధికారి రాము నవగీతం, జగిత్యాల ప్రతినిధి: చదువుతోపాటు సంస్కారం అలవాటు చేసుకోవాలని జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము అన్నారు. పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధరూర్ క్యాంపులో గురువారం పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిర్భయంగా రాయాలని అన్నారు. అదేవిధంగా పరీక్షల తర్వాత మరుసటి రోజు పాఠశాలకు వచ్చి తదుపరి సబ్జెక్టు ప్రిపేర్ కావాలని, సందేహాలున్నచో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి...