చొప్పదండి ఎమ్మెల్యేను కలిసిన ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం

నవగీతం, కొడిమ్యాల: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన చొప్పదండి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ కార్యవర్గ సభ్యులు, యూనియన్ సభ్యులతో కలిసి ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పడిన ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియా ప్రతినిధులు సమాజానికి కీలకమైన సేవ అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.యూనియన్ కార్యవర్గం ఐక్యంగా పనిచేస్తూ జర్నలిస్టుల సమస్యల...