జగిత్యాలలో నారీశక్తి అస్మిత క్రీడా పోటీలు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కేంద్ర యువజన, క్రీడల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా నారీశక్తి అస్మిత క్రీడా పోటీలను జగిత్యాల జిల్లాలో నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి డాక్టర్ కోరుకంటి రవికుమార్ ఆధ్వర్యంలో ఈ పోటీలు గురువారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాలికల కోసం కబడ్డీ,...