నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి –శ్రీనివాస్ దంపతులు మరియు వార్డ్ కౌన్సిలర్లను అయ్యప్ప ట్రస్ట్ సభ్యులు వేద బ్రాహ్మణుల ఆశీర్వచనముతో ఘనంగా సన్మానించారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులతో జగిత్యాల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, జగిత్యాల మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.