జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు
గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మవద్దు సమీక్షా సమావేశంలో అధికారులు నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కమీషనర్ పౌరసరఫరా శాఖ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయంలో అదనపు కలెక్టర్ జగిత్యాల, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగిత్యాల అధ్యక్షతన గ్యాస్ ఏజెన్సీ యజమానులు, సేల్స్ ఆఫీసర్లు, జిల్లా తహసిల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని తెలిపారు. జిల్లాలో గృహ వినియోగ (డొమెస్టిక్) వంటగ్యాస్ సిలిండర్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు....