నవగీతం, ఖమ్మం:
ఖమ్మం జిల్లా డాక్టర్స్ సెల్ అద్యక్షులుగా డాక్టర్ కాపా మురళి కృష్ణ కు నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షులు గా నియమించిన తెలంగాణ రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డికి, నియామకానికి సహకరించిన జిల్లా మంత్రి భట్టి విక్రమార్క మల్లు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్, మట్టా రాగమయి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ లకు ధన్యవాదాలు, కృతఙ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ పటిష్ట పరచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా పాటు పడతానని, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు రంగా జనార్ధన్, కాంగ్రెస్ నాయకులు తోటకూర శ్రీకాంత్, గంగవరపు కిషన్ రాయి లు పాల్గొన్నారు.