navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 1:36 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జ్యోతిబాపూలే మైదానంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి

నవగీతం, కరీంనగర్:

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమం జ్యోతిబాపూలే మైదానంలో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరాల జ్యోతి నరేందర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురామ్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజికరాలు , స్త్రీల విద్యాభివృద్ధి హక్కుల కోసం కృషి చేసిన తొలి తరం మహిళ ఉద్యమకారిని రచయిత్రి ఆమె జయంతిని వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని , ఈ జ్యోతిబాపూలే మైదానంలో ఆదిదంపతుల విగ్రహాలు ఏర్పాటుచేసి వచ్చే జయంతి వర్ధంతిలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ , బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి గాజే ప్రజ్జోద్ , బిసి విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు బియ్యని తిరుపతి , బీసీ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కాసరాజు , వరాల నరేందర్ తో పాటు బీసీ సంక్షేమ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు..