navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 12:39 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

టీఆర్టీఎఫ్ లో భారీ చేరికలు

సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపాధ్యాయులంతా ఐక్యం కావాలి

నవగీతం,కరీంనగర్:

ఉపాధ్యాయుల హక్కుల పోరాటంతో పాటు విద్యార్థి సంక్షేమం, ప్రభుత్వ విద్య బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్న ‘తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్’లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో, సీనియర్ ఉపాధ్యాయ నాయకులు టీపీటీఎఫ్ మాజీ అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సి హెచ్ రాజేశ్వరరెడ్డి మల్లికార్జున్,ఏ.రాంచంద్రం,విజేందర్ రెడ్డి, రాజయ్య ,శశిధర్, యం.డి.ఇస్మాయిల్, డా.మల్లికార్జున్, రాజశేఖర్ రెడ్డి, రవీందర్,టీఆర్టీఎఫ్ లో చేరారు.ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మానేటి ప్రతాపరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ వారిని సాదరంగా సంఘంలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మానేటి ప్రతాపరెడ్డి కటకం రమేష్ మాట్లాడుతూ..విద్యా క్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న దామోదర్ రెడ్డి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు చేరడం శుభపరిణామమని కొనియాడారు. నేడు బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఇటువంటి విద్యాపరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపాధ్యాయులంతా ఐక్యం కావాలని వారు పిలుపునిచ్చారు. టీఆర్టీఎఫ్ కేవలం ఉపాధ్యాయ సమస్యలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ పాఠశాలల మనుగడ కోసం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడుతుందని వారు స్పష్టం చేశారు.భవిష్యత్తులో వచ్చే అన్ని ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటూ,విద్యారంగ అభివృద్ధికి సంఘటితంగా ముందుకు సాగుతామని వారు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ రావు, ఖాజా మంజూరలీ, సలీం, రాష్ట్ర మెంబర్షిప్ కన్వీనర్ ప్రభాకర్ రావు, రాష్ట్ర బాధ్యులు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.