navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 9:12 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

తల్లిదండ్రుల మృతితో మనస్తాపం… యువకుడు ఆత్మహత్య

నవగీతం, మెట్ పల్లి:

మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఓ యువకుడు తల్లిదండ్రుల మృతితో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెట్‌పల్లి పట్టణానికి చెందిన భాస అక్షయ్ (24), తండ్రి నారాయణ, కులం పద్మశాలి. ఇటీవల తల్లిదండ్రులు మరణించడంతో అక్షయ్ తీవ్రంగా మానసికంగా కృంగిపోయి ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి చెంది మార్చి 10వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో గడ్డి మందు తాగాడు. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 12వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని పెద్దనాన్న కొడుకు భాస మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మెట్ పల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ కుమార్ తెలిపారు.