తూతూ మంత్రంగా ఆర్ అండ్ బీ రోడ్డుపై గుంతలు పూడ్చివేత
ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆర్ అండ్ బి రహదారి మరమ్మతు పనులు తూతూ మంత్రంగా నిర్వహించడంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా రహదారి పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు గురువారం రహదారిపై ఉన్న గుంతలను డాంబర్‌తో పూడ్చే పనులు చేపట్టారు.అయితే గుంతలను సరైన విధంగా మరమ్మతు చేయకుండా పైపైగా డాంబర్...