నవగీతం, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిసి జగిత్యాల నియోజకవర్గం లో మొక్కజొన్న పంట అధిక మొత్తంలో సాగు చేయడం జరిగిందని మొక్కజొన్న పంట కోత దశకు వచ్చినందున రైతులకు ఇబ్బంది లేకుండా, దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ద్వారా మార్క్ ఫెడ్ ఆద్వర్యం లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరగా, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి త్వరితగతిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్క్ ఫెడ్ ఆద్వర్యం లో ఏర్పాటు చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.