దశాబ్దాలుగా వెలమ రెడ్డి రాజకీయాల మధ్య నలుగుతున్న జగిత్యాల బీసీ రాజకీయాలు
టి జీవన్ రెడ్డి భవిష్యత్తు ఎలా వుండాలి బి.ఎస్.రాములు సామాజిక తత్వవేత్త ఫోన్: 8331966987 ఇటీవల ఏర్పడిన జగిత్యాల జిల్లా ప్రాంతం దశాబ్దాలుగా వెలమ, రెడ్డి రాజకీయాల మధ్య బీసీల రాజకీయాలు నలిగి పోతున్నాయి. పార్టీ టికట్ ఇస్తే బీసీలు తప్పకుండా గెలుస్తారు.కాని టికట్ రాకుండా రాజకీయాలు చేస్తారు. టికట్ వచ్చాక సొంత పార్టీ అభ్యర్థిని ఓడించే రాజకీయాలు చేస్తారు. అయినా బీసీలు టికట్ ఇచ్చాక గెలుచుకుంటూ వచ్చారు. జగిత్యాల నియోజక వర్గ రాజకీయాల్లో 1969 జై తెలంగాణ ఉద్యమం ఒక మలుపు. బీసీ విద్యార్థులు బాగా చైతన్యవంతులయ్యారు. నిజానికి 1953...