నల్లగొండ దేవస్థానం నూతన ఈఓగా వి.అనూష బాధ్యతలు స్వీకరణ

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) గా వి. అనూష బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈఓ వి. అనూష మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత...